top of page

🐟🔴🏞️ చనిపోయి కుప్పలు, తెప్పలుగా కొట్టుకొచ్చిన చేపలు.. 🐟🔴🏞️

🏞️🐟 బనగానపల్లె నియోజకవర్గంలో ఈ నెల ఏడవ తేదీన కుందూనదిలో చేపలు వేల సంఖ్యలో మృతి చెంది గుట్టులు గుట్టలుగా ఒడ్డుకు కొట్టుకురావడం కలకలం రేపింది. 🐟🔴🏞️

🔴🏞️ పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాలు కుందూ నదిలో అధిక మోతాదులో కలవడం వల్ల కోవెలకుంట్ల, భీమునిపాడు, క్రిష్టిపాడు గ్రామాలలో చేపలు ఆక్సిజన్ అందక మృత్యువాత పడినట్లు కమిటీ తేల్చింది. 🐟

🐟🔴🏞️ నంద్యాల కుందూనది బ్రిడ్జి భాగంలో చనిపోయిన చేపలు పైకి తేలి ప్రవాహానికి కొట్టుకొని వచ్చి బనగానపల్లె కుందూనదిలో తేలినట్లు నిర్ధారించారు. 🐟🔴🏞️

🔴🏞️ నంద్యాల శివారులో ఉన్న ఎస్.పి.వై. ఆగ్రో ఇండస్ట్రీస్, నందిగ్రైన్స్ డెరివేటివ్స్, నంది మిల్క్ డైరీ పరిశ్రమల వ్యర్థాలు, నంద్యాల పట్టణ మురుగు నీరు కుందూనదిలో కలవడం వలనే చేపలు మృతి చెందినట్లు కమిటీ నిర్ధారించింది. దీంతో కమిటి నివేదికల అధారంగా జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని కంపెనీలపై తుది చర్యల నిమిత్తం కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలికి నివేదికలు పంపారు. కుందూ నుంచి మండలంలోని 15 గ్రామాలకు పశువులకు, నిత్యవసరాలకు వాటర్ సప్లై అవుతోంది. దీంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు. 🔴🏞️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page