top of page

ఎమ్మెల్యేల కొనుగోలు... 🧐🔍 శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులపై దర్యాఫ్తు కొనసాగుతోంది: సైబరాబాద్ సీపీ 🕵️‍♂️💼

సైబరాబద్ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సీపీ అవినాశ్ మహంతి 📢👮 2022తో పోలిస్తే 2023లో నేరాలు పెరిగినట్లు వెల్లడి 📆📈 మహిళలపై నేరాలు పెరిగాయని... అత్యాచారాలు తగ్గాయని వెల్లడి 💪🚺 ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. 🏠📑 త్వరలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. 📄💼

సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సీపీ శనివారం విడుదల చేశారు. 📅📣 మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాఫ్తు కూడా కొనసాగుతోందని చెప్పారు. 📄🕊️ కమిషనరేట్ పరిధిలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో నేరాలు పెరిగినట్లు తెలిపారు. 📅📈 అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ పరిధిలో సిబ్బంది రెండు నెలలు సమర్థవంతంగా పని చేశారన్నారు. 🗳️🤝 కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు 2022లో 4,850 ఉంటే... 2023లో 5,342 కేసులు నమోదయ్యాయని, డ్రగ్స్ కేసులు గత ఏడాది 277 కాగా, ఈ ఏడాది 567గా ఉన్నాయన్నారు. 💻📉 ఆర్థిక, స్థిరాస్తి కేసులు కూడా పెరిగినట్లు చెప్పారు. 💰🏡 బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ సంవత్సరం మహిళలపై నేరాలు పెరిగినట్లు చెప్పారు. 🚺⚖️ అత్యాచారాలు తగ్గినట్లు తెలిపారు. 2022లో 316 అత్యాచారాలు నమోదయితే ఈసారి 259 నమోదైనట్లు వెల్లడించారు. 👩‍⚖️🔒 రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు పెరిగాయన్నారు. 🚗🚫 ఈ ఏడాది 52 వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. 🍻🚗 నూతన సంవత్సర వేడుకలపై స్పందిస్తూ... ఈ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. 🎉🎆 లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. 🤔🚫 నూతన సంవత్సర వేడుకల సమయంలో తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. 🚗🚫🚨

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page