top of page

ఒక్క మ్యాచ్ తో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డులు..

ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది.

గుజరాత్ తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో ధోని కెప్టెన్సీ అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసేందుకు అతడు పన్నిన వ్యూహాలు ఫలిచడంతో చెన్నై విజయం సాధించింది. ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ధోని వ్యూహంలో చిక్కుకుని స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా కేవలం 8 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్ లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫస్ట్ టైమ్ ఆలౌట్

ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. గతేడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లోనూ అద్భుతంగా ఆడింది. 10 మ్యాచ్ లు నెగ్గి 20 పాయింట్లతో లీగ్ టాపర్ గా ప్లేఆఫ్ కు చేరింది. అయితే క్వాలిఫయర్1 మ్యాచ్ లో సీఎస్కే చేతిలో ఓటమి ఎదురైంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది. అంతేకాదు హార్దిక్ సేన తొలిసారి ఆలౌట్ కావడం విశేషం. రుతురాజ్ గైక్వాడ్ ఘనత

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్ పై 4 హాఫ్ సెంచరీలు సాధించిన సీఎస్కే బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు గుజరాత్ చెన్నై జట్ల మధ్య నాలుగు మ్యాచ్ లు జరగ్గా నాలుగుసార్లు అతడొక్కడే అర్ధసెంచరీలు బాదాడు. తాజా మ్యాచ్ లో 44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ తో 60 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page