top of page
MediaFx

ఏడుస్తున్నట్టు కలలు వస్తున్నాయా.. జరిగేది ఇదే!

ఎవరికైనా సరే కలలు రావడం అనేది కామన్ విషయం. నిద్రపోతున్నప్పుడు ఏవో ఒక కలలు వస్తూ ఉంటాయి. ఈ కలల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని సంతోషం కలిగించేవి ఉంటే.. మరికొన్ని బాధ పెట్టేవి ఉంటాయి. కలలు భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ సంఘటనల గురించి చెబుతుందని డ్రీమ్స్ సైన్స్ చెబుతుంది. 

ఒక్కోసారి నిద్రలో ఏడుస్తున్నట్టు కలలు వస్తాయి. మరి అలాంటి కలలు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కలలో ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే.. ఆ కలు శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని ఆ కల సూచన. ఇలాంటి కల ఎప్పుడైనా వస్తే ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగే కలలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఏడిస్తే.. ఇంటికి ఓ కొత్త సభ్యుడు వస్తున్నాడని అర్థమట. అలాగే ఇలాంటి కల వల్ల మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీంతో పాటుగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 

కలలో మీకు ఎవరో వ్యక్తి ఏడుస్తూ ఉంటే.. మీరు ఏదో విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి కల వస్తే మీరు ఒత్తిడి నుంచి బయట పడతారు. అలాగే మీ జీవితంలోకి ఆనంద కూడా వస్తుంది. మీ కలలో ఏడుస్తున్న పూర్వీకులను చూస్తే.. వారి ఆత్మకు శాంతి లభించలేదని అర్థం. కాబట్టి వాళ్లకు పిండం పెట్టి.. పితృ దేవతలకు నీటిని సమర్పించండి. ఇది పూర్వీకులకు శాంతిని కలిగిస్తుంది. మీకు శుభ ఫలితాలను కూడా ఇస్తుంది.


bottom of page