top of page
Suresh D

ఏడ్చినా బరువు తగ్గుతారట తెలుసా ..!


ఏడిస్తే బాధ ఉంది అనుకుంటారు. అయితే, ఏడ్వడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏడ్వడం వల్ల బరువు తగ్గుతారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అంటే.. ఏడుపు కేలరీలు బర్న్ చేస్తాయి. రోజూ కాసేపు ఏడిస్తే కేలరీలు తగ్గుతాయట. ఎంతసేపు ఏడిస్తే ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయో తెలుసుకోండి.

ఎంతసేపు ఏడ్వాలి..

సాధారణంగా కేలరీలు బర్న్ అవ్వాలంటే కాసేపు స్విమ్మింగ్ చేస్తే బెటర్ అని అంటారు. దీంతో పాటు నవ్వినా కేలరీలు ఖర్చవుతాయని అంటారు. అదే విధంగా, ఏడ్చినప్పుడు దాదాపు మొత్తంలో కేలరీలు కరిగిపోతాయి. ఒక్క నిమిషం నవ్వితే దాదాపు 1.3కేలరీలు ఖర్చవుతాయి. ఏడ్చినప్పుడు కూడా అంతే. 10 నిమిషాలు పాటు ఏడిస్తే 10 నుంచి 13 కేలరీలు ఖర్చవుతాయి. దాని కోసం ఏడవాల్సిన అవసరం లేదు. కానీ, భావోద్వేగ ప్రభావం కారణంగా ఏడుపుని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు.


కేలరీలు బర్న్ చేసేందుకు..

వర్కౌట్ కాకుండా, కొన్ని అలవాట్ల కారణంగా కేలరీలు బర్న్ చేయడంలో సాయపడతాయి.

ఆటలు ఆడడం

పుష్కలంగా నీరు త్రాగడం

తగినంత నిద్రపోవడం

ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం

చక్కెర, కొవ్వు పదార్థాలు తగ్గించడం

ఏడిస్తే లాభాలు..

ఏడ్చిన తర్వాత మనసుని కాస్తా మెరుగ్గా ఉంటుంది.

మీరు పడుకున్నప్పుడు మీరు త్వరగా నిద్రపోతారు.

మీ శరీరంలో కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడుతారు.

మీ కంటి చూపు మెరుగుపడుతుంది.

ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. తద్వారా మీ శరీరం విముక్తి పొందుతుంది.

మీ శరీరం మరింత శక్తివంతంగా మారతుంది.

ప్రశాంతంగా ఉంటుంది.

ఏడిస్తే చర్మానికి కలిగే లాభాలు..

ప్రతి ఒక్కరూ కూడా ఏదో టైమ్‌లో ఏడుస్తారు. ఏడ్వడం శరీరానికి, మనసుకి మేలు చేస్తుంది. చర్మానికి ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఎక్కువసేపు ఏడిస్తే చర్మం పాడవుతుంది.

డీహైడ్రేట్ అవుతుంది

చికాకు తగ్గుతుంది

కళ్ళు ఎర్రబడతాయి.

ఏడ్చిన తర్వాత ముఖాన్ని అదే పనిగా క్లాత్, టిష్యూలతో తుడవొద్దు. దీని వల్ల చర్మానికి నష్టం జరుగుతంది. చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోండి.

Comments


bottom of page