top of page
Shiva YT

🤖చాట్ జీపీటీకి పోటీగా ‘కృత్రిమ్ ఏఐ’🗣️

కృత్రిమ్ ఏఐ రెండు వెర్షన్లలో వస్తుంది. కృత్రిమ్, కృత్రిమ్ ప్రో. కృత్రిమ్ వెర్షన్ 22 భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. హిందీ, తమిళ్, బెంగాలి, మరాఠీ, కన్నడ, గుజరాతి, హింగ్లిష్, స్టాండర్డ్ ఇంగ్లిష్ వంటివి లిస్ట్ లో ఉన్నాయి.

ఎలా వినియోగించాలి..

ప్రస్తుతం వినియోగదారులు భారతీయ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి సైన్ అప్ చేయవలసి ఉంది. ముందుగా chat.olakrutrim.com వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి సేవ కోసం సైన్ అప్ చేయండి. మీ ఫోన్ నంబర్ నుంచి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీరు ఉపయోగించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి. ఆ తర్వాత మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నను చాట్ బాట్ ను అడగొచ్చు. దానికి సమాధానాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తాయి.

ఈ కృత్రిమ్ వెబ్ సైట్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, జెమినీ లను పోలి ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీరు దానిపై కామెంట్ చేయొచ్చు. లైక్ లేదా డిస్ లైక్ చేయొచ్చు. వినియోగదారుడు సంతృప్తి చెందలేదని కృత్రిమ్ గ్రహించి తన రెస్పాన్స్ ను రిక్రియేట్ చేసుకుంటుందని కంపెనీ ప్రకటించింది. వెబ్ సైట్ ఎడమ చేతి వైపునా చాట్ బాట్ తో మాట్లడినదంతా రికార్డు అయ్యి ఉంటుంది. ఈ హిస్టరీని డిలీట్ చేసే ఆప్షన్ ప్రస్తుతానికి లేదు.

ఉపయోగాలు ఏంటి..

ఈ కృత్రిమ్ ఏఐ ద్వారా కోడ్లు రాయోచ్చు, ఫుడ్ రెసిపీలను పొందొచ్చు, ఆర్టికల్స్ పొందొచ్చు, ట్రావెల్ ప్లానింగ్ వంటివి సులభంగంగా పొందొచ్చు. గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, కృత్రిమ్ ఇప్పటికీ బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి సెప్టెంబర్ 2021 తర్వాత సమాచారానికి పరిమితం చేసింది. కాబట్టి మీరు వాస్తవాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. 📱🌐🍲


Comments


bottom of page