top of page

📅🏏🇬🇧 రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోనే మళ్లీ ఆరంగేట్రం..

యాషెష్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా రెండు టెస్టులు, ఇంగ్లాండ్ 2 టెస్టులు గెలవగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. దీంతో సిరీస్‌ని ఇరు జట్లు 2-2 గా పంచుకున్నాయి. అయితే ఇరుజట్ల మధ్య ఐదో టెస్టు జరుగుతున్న సమయంలోనే రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇంగ్లీష్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. మ్యాచ్ అనంతరం విడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కి ముగింపు పలికినా.. ఆటకు మాత్రం దూరం కాబోను అంటున్నాడు. ఈ క్రమంలోనే ఆటకు దగ్గరగా ఉండే మరో విభాగంలో ఆరంగేట్రం కూడా చేశాడు. ఇక బ్రాడ్ ఆరంగేట్రం సందర్భంగా అతనికి భారత జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ స్వాగతం పలికాడు. 🤝🏏🎉

అవును, బ్రాడ్ తన క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలికాడు. కానీ క్రికెట్ నుంచి దూరం కాలేదు. రిటైర్‌మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే క్రికెట్‌ కామెంటేటర్‌గా ఆరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్రీలో బ్రాడ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీనేష్ కార్తిక్ ఇంకా క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోకున్నా కామెంటరీ చెబుతున్నాడు. ఇక కామెంటేటర్‌గా బ్రాడ్ ఆరంగేట్రం చేస్తున్న సందర్భంలో అతనికి దినేష్ స్వాగతం పలికాడు. ఇంకా తన ట్విట్టర్ ఖాతా నుంచి ‘స్వాగతం బ్రాడ్.. నువ్వు బాగా రాణించగలవు’ అంటూ ట్వీట్ చేశాడు. దీనేష్ కార్తిక్ చాలా కాలంగా స్కై స్పోర్ట్స్ తరఫున కామెంటేటర్‌పాత్రలో కనిపిస్తున్నాడు. 🎙️🏏📺

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page