🏆🇮🇳 వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను నెగ్గిన భారత్.. ప్రస్తుతం టి20 సిరీస్ ఆడుతుంది. 👏 అనంతరం ఐర్లాండ్ తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. 🏆🇱🇰 ఆ తర్వాత ఆసియా కప్ కోసం శ్రీలంకకు వెళ్లనుంది. 🛫
💔గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. 😢 త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
🏟️ ప్రస్తుతం అతడు బెంగళూరులోని క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. 👉 మాములుగా కోలుకోవడం కాదు.. వేగంగా కోలుకుంటున్నాడు. 👍 అతడి రికవరీని చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.
⚾ పంత్ కుడికాలి మూడు లిగ్మెంట్లు తెగిపోయాయి. 🩹 వాటికి సర్జరీలు జరిగాయి. 👩⚕️ అలాగే వీపు భాగం పూర్తిగా కాలిపోయింది. 🏥 అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. 🤖 ప్రస్తుతం పంత్ చక్కగా నడవడమే కాకుండా.. బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. 🏏
🏃 ప్రస్తుతం పంత్ ఎన్సీఏలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ⏱️ త్వరలోనే అతడు రన్నింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. 100 శాతం ఫిట్ నెస్ సాధించేందుకు పంత్ కు మరో 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 🏃♂️
🏴 వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్ తో పంత్ పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. 🏴🏏
🕊️ మృత్యువు ఒడి వరకు వెళ్లి వచ్చిన పంత్.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని అతడి అభిమానులతో పాటు క్రికెట్ ను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ❤️🏏