top of page

3️⃣9️⃣ ఏళ్లుగా నెరవేరని కల..

🏏 క్రికెట్ అభిమానులు 3️⃣9️⃣ ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రత్యేక మ్యాచ్ ఈసారి కూడా కనిపించలేదు. ఆసియా కప్ 2023 ఫైనల్ ఏ జట్ల మధ్య జరగాలో నిర్ణయమైంది.

సెప్టెంబర్ 17న భారత్, శ్రీలంక జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూసినా శ్రీలంక అద్భుతమైన ఆటతీరుతో అది కుదరలేదు. అయితే ఈసారి రెండు జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అవ్వగా, మరో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏకపక్షంగా విజయం సాధించింది. 🏆🏏

1️⃣9️⃣8️⃣4️⃣ నుంచి ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. ఈసారి 1️⃣6️⃣వ ఎడిషన్‌ టోర్నీ జరుగుతోంది. అదే సమయంలో ఈ టోర్నమెంట్ 1️⃣3️⃣ సీజన్లు వన్డే ఫార్మాట్‌లో జరిగాయి. వన్డే ఫార్మాట్ 1️⃣4️⃣వ సీజన్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అయితే భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్ మ్యాచ్‌లో తలపడలేదు. ఈసారి భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్స్‌కు చేరుకోవడానికి పెద్ద పోటీదారులుగా భావించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. 🏆🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page