top of page

🏏🇱🇰 లంక చేతిలో ఓటమితో పాక్‌ డెబ్యూ ప్లేయర్‌ కన్నీళ్లు..

🏆🌍 ఆసియా కప్ గెలవాలన్న పాకిస్థాన్ కల చెదిరిపోయింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మరోసారి ఈ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 🏏🌏

ఆసియా కప్-2023లో భాగంగా గురువారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో భారత్‌తో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. 🇮🇳🇱🇰 కాగా ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి శ్రీలంక గెలుపొందింది. త్రుటిలో విజయం చేజారిపోవడంతో పాక్ ఆటగాళ్లంతా చాలా బాధపడ్డారు. 😔🏏 అయితే ఒక ఆటగాడు మాత్రం ఈ ఓటమిని దిగమింగుకోలేకపోయాడు. 🏏 మ్యాచ్‌లో పాక్‌ ఓటమి ఖరారు కాగానే మైదానంలో కూలబడిపోయాడు. 👏 కన్నీళ్లు పెట్టుకున్నాడు. 🙌 అతను మరెవరో కాదు.. శ్రీలంకతో జరిగినమ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన పాక్‌ ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్. 🏁🇵🇰🇱🇰

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page