షాహీన్ షా అఫ్రిది.. టీమిండియాకి అతిపెద్ద ముప్పుగా మారే పాకిస్తాన్ కీ ఫాస్ట్ బౌలర్. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఈ బౌలర్ రోహిత్ సేనకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అయితే నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది గాయం కారణంగా.. తన కోటా బౌలింగ్ పూర్తి చేయలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్రిది కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. గాయంతో మిగిలిన 5 ఓవర్ల కోటా పూర్తి చేయకుండానే మైదానం వీడాడు. 🏏🇵🇰
షాహీన్ అఫ్రిది ఆడకపోతే..
షాహీన్ భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడకపోతే, ఆరంభ ఓవర్లలో పాక్ జట్టుకు వికెట్లు దక్కడ కష్టమే. కొత్త బంతితో వికెట్లు తీయడం షాహీన్ స్పెషలిటీ. బౌలింగ్‌లో పాకిస్థాన్‌కు అవసరమైన ఆరంభాన్ని అందించగలడు. 🏆🎾
షాహీన్ లేకపోవడం వల్ల, పాకిస్తాన్ పవర్‌ప్లేలో కూడా గట్టిగానే నష్టపోతుంది. నిజానికి షాహీన్ అఫ్రిది కేవలం పవర్‌ప్లేలో మాత్రమే వికెట్లు తీయడం కాదు.. పరుగులు కూడా పరిమితంగానే సమర్పిస్తాడు. 🏏🌟
భారత ఓపెనర్లకు షాహీన్ అఫ్రిది ముప్పుగా మారవచ్చు. వారిని కంట్రోల్ చేయడంలో సమర్ధుడు. ఇలాంటి పరిస్థితిలో, అతడు పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోతే.. భారత్ ఓపెనర్లు వికెట్‌పై స్థిరపడే అవకాశం ఉంటుంది. దీంతో పాకిస్తాన్‌కు మొదటి దెబ్బ పడినట్టే. 🏏🏅
పాకిస్థాన్‌కు అతిపెద్ద వికెట్ టేకర్ షాహీన్ అఫ్రిది. పవర్‌ప్లేలోనే కాకుండా మిడిల్ ఓవర్లలో కూడా ఈ పని చేయగలడు. 🏏🔝
షాహీన్ కొత్త బంతితో మాత్రమే కాదు.. డెత్ ఓవర్లలోనూ అద్భుతాలు చేయగలడు. అలాగే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయకుండా అడ్డుకోగలడు. 🌟🏏