top of page

కింగ్ ఎక్కడైనా కింగే.. పాక్ ప్లేయర్లే ఉన్న ఆ లిస్టులో కోహ్లీనే టాప్..! 👑🏏

పాకిస్తాన్, నేపాల్ మధ్య జరిగిన ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో బాబర్ అజామ్ 151 పరుగులు చేశాడు. తద్వారా బాబర్ తన సీనియర్ అయిన యూనీస్ ఖాన్ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు టోర్నీ చరిత్రలో ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 🏏👑

పాక్, నేపాల్ మ్యాచ్ జరగక ముందు పాకిస్తాన్ మాజీ ప్లే్యర్ యూనీస్ ఖాన్ 144 పరుగులతో.. ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉండేవాడు. కానీ ఆ స్థానాన్ని ఆబార్ అక్రమించడంలో యూనీస్ మూడో స్థానానికి దిగాడు. 😕🏏

అయితే ఆసియా కప్ టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కింగ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అవును, కింగ్ కోహ్లీ 2012 ఆసియా కప్ టోర్నీలో పాక్‌పై ఏకంగా 183 పరుగులు చేసి ఈ రికార్డ్‌ను స్థాపించాడు. టోర్నీ చరిత్రలో ఇదే టాప్ స్కోర్. 🏆👑

ఇక కోహ్లీ తర్వాత రెండో స్థానంలోకి తాజాగా బాబర్ 151 పరుగులతో చేరాడు. బాబర్ ఈ పరుగులను 2023 ఆసియా కప్‌లో భాగంగా పసికూన నేపాల్‌పై చేసిన సంగతి తెలిసిందే. 🇵🇰🏏

మూడో స్థానంలో ఉన్న యూనీస్ ఖాన్ క్రికెట్‌లో మరో పసికూన అయిన హాంక్ కాంగ్‌పై 2004 ఆసియా కప్ టోర్నీలో 144 పరుగులు చేశాడు. 🏏👑

ఈ లిస్టు నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ ఉన్నాడు. 2018 ఆసియా కప్ టోర్నీలో శ్రీలంకపై రహీమ్ 144 పరుగులు చేయడం ద్వారా టాప్ 5 లిస్టులో స్థానం పొందాడు. 🇧🇩🏏

ఆసియా కప్ టోర్నీలో ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా పాక్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఉన్నాడు. మాలిక్ 2004 ఆసియా కప్ టోర్నీలో భారత్‌పై 143 పరుగులు చేశాడు. 🏆🏏

Comments


bottom of page