🇦🇫 అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్ మరోసారి నిరాశపర్చడంతో మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో దారుణ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
దీంతో పాక్ జట్టు 47.1 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్ఘానిస్తాన్ జట్టు ఈ స్కోరును ఛేజ్ చేస్తుందని అనిపించింది. కానీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్ ముందు, ఆఫ్ఘానిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడ్డారు. మొత్తం జట్టు 19.2 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ అయ్యి 142 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. 🏆🏏
🎳 పాక్ బౌలర్లు అద్భుత ఆటతీరు కనబరిచినా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. కెప్టెన్ బాబర్ ఆజం ఖాతా కూడా తెరవలేకపోయాడు. మహ్మద్ రిజ్వాన్ కూడా తన ఇన్నింగ్స్‌ను 21 పరుగులకు మించి తీసుకెళ్లలేకపోయాడు. ఇమామ్-ఉల్-హక్ ఖచ్చితంగా జట్టు తరపున అర్ధ సెంచరీని సాధించాడు. కానీ, అతనికి అవతలి ఎండ్ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. ఇమామ్ 94 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. షాదాబ్ ఖాన్ 39, ఇఫ్తికర్ అహ్మద్ 30 పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్ తరపున ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు. 🎯🎉