top of page
Shiva YT

🏏 టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్🏆🇮🇳

🗓️ నేడు (ఆగస్టు 1) భారత్, వెస్టిండీస్ మధ్య మూడో, చివరి వన్డే జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కనిపించడం అనుమానంగానే ఉంది. 2వ వన్డే సమయంలో విశ్రాంతి తీసుకున్న కోహ్లి 3వ మ్యాచ్‌కి కూడా దూరమయ్యే అవకాశం ఉంది. 🏟️👨‍🦯

🏏 విరాట్ కోహ్లి సోమవారం సాయంత్రం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు భారత జట్టుతో కలిసి వెళ్లలేదు. దీంతో మంగళవారం నాటి వన్డే సిరీస్ నిర్ణయాత్మక వన్డేకు అతను అందుబాటులో ఉండడు అనే ఊహాగానాలు పెరిగాయి. 🤝🏏

🏆 మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు విశ్రాంతినిచ్చారు. కానీ, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేసింది. దీంతో మంగళవారం జరగనున్న చివరి వన్డే మ్యాచ్ ఫైనల్ పోరుగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవచ్చు. 🏆🏏

🇮🇳🏏 వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడాకేష్ మోతీ, జాడెన్ సీల్స్, కేసీ కార్తీ, ఒషానే థామస్, అల్జారీ థామస్, కెవిన్ సింక్లైర్. 🇧🇧👨‍🦯

bottom of page