top of page
Shiva YT

ప్రపంచ కప్ ఆడే టీమిండియా నుంచి ఈ ప్లేయర్లు ఔట్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

మహేంద్ర సింగ్ ధోని: 2019 వరల్డ్ కప్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మ్యాన్‌గా కనిపించిన ఎంఎస్ ధోని 😎🏏🇮🇳 ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక వేళ బెన్ స్టోక్స్ మాదిరిగా రిటైర్‌మెంట్ నుంచి తిరిగొచ్చే పరిస్థితి కూడా ధోనికి లేదు, ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన తర్వాత మహీ మోకాలి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ను ఇంకా సంపాదించలేదు. 💪👑

శిఖర్ ధావన్: గత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున 2 మ్యాచ్‌లు ఆడిన ధావన్ మొత్తం 125 పరుగులు చేశాడు. అయితే గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ధావన్‌ను ఈసారి జట్టులో ఆడేందుకు పరిగణనలోకి తీసుకోరని ఇప్పటికే అంతా స్పష్టమైంది. 💥🦁🏏

విజయ్ శంకర్: 2019 వన్డే ప్రపంచ కప్ జట్టుకు ఆశ్చర్యకరమైన ఎంపిక విజయ్ శంకర్. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 58 పరుగులే చేసిన ఈ ఆటగాడు, 2023 మెగా టోర్నీ కోసం ఎక్కడా చర్చలో కూడా లేదు. ఇప్పటికే అతని విషయంలో టీమిండియా తలుపులు మూసుకుపోయాయి. 🏏🔥🇮🇳

కేదార్ జాదవ్: 2019 వన్డే ప్రపంచ కప్ జట్టుకు మరో ఆశ్చర్యకరమైన ఎంపిక కేదార్ జాదవ్. ఐదు మ్యాచ్‌ల్లో జాదవ్ 80 పరుగులు మాత్రమే చేసినా ఆ టోర్నీ తర్వాత జాదవ్‌కు అవకాశమే దక్కలేదు. 🚴‍♂️👏🏆

భువనేశ్వర్ కుమార్: గత వన్డే ప్రపంచకప్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 10 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భువీ పేరు చర్చల్లో కూడా లేనందున అతనికి 2023 వన్డే ప్రపంచకప్ జట్టులో అవకాశం ఉందదనే చెప్పాలి. 🏹🌍👍

రిషబ్ పంత్: 2019 వన్డే ప్రపంచకప్‌లో పంత్ 4 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేశాడు. పంత్‌కి 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదం జరగకుంటే పంత్ ఈ సారి జరిగే ప్రపంచకప్ టోర్నీలో కచ్చితంగా ఉండేవాడు. 🧢🤞🇮🇳

దినేష్ కార్తీక్: 2019 వన్డే ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్ 2 మ్యాచ్‌ల్లో 14 పరుగులే చేసిన ఈ ఆటగాడు. ఆ తర్వాత కూడా డీకేకి టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కినా కానీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. 🏹🎯🌟

bottom of page