🏏 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా సచిన్ రికార్డులు నెలకొల్పాడు. 🥳 ఈ సెంచరీల ప్రయాణం ఈ రోజున అంటే ఆగస్టు 14 న, అది కూడా ఇంగ్లాండ్ గడ్డపై ప్రారంభమైందని మీకు తెలుసా. 📅
🇮🇳 ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి ప్రమాదంలో పడింది. ఆగస్టు 14న అంటే భారత స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు మ్యాచ్ ముగియాల్సి ఉంది. 🇮🇳 అయితే బ్రిటీష్ వారి నుంచి టీమ్ ఇండియా ఓటమి ముప్పును ఎదుర్కొంటోంది. 🏴 ఇలాంటి పరిస్థితుల్లో 17 ఏళ్ల సచిన్ మాత్రమే బ్రిటీష్ వారితో పోరాడాడు. 🤯 దేశ ప్రజలంతా స్వాతంత్య్రం కోసం ఎంతలా పోరాడారో.. అదే స్ఫూర్తితో సచిన్ కూడా ఈ మ్యాచ్ గెలిచాడు. 🇮🇳 అంటే, ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం ద్వారా భారత్ ఓటమిని తప్పించాడు. 🏆 బ్రిటీష్ విజయానికి అడ్డుకట్ట వేశాడు.
🏏 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 519 పరుగులు చేసింది. 🏴 కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 179, సంజయ్ మంజ్రేకర్ 93, సచిన్ టెండూల్కర్ 68 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసింది. 🇮🇳 ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌కు 408 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 🎯 ఈ లక్ష్యం ముందు భారత జట్టు తడబడింది.
🏏 మ్యాచ్ చివరి రోజున భారత్ తన ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ 127 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 🇮🇳 నవజ్యోత్ సింగ్ సిద్ధూ (0), రవిశాస్త్రి, (12), సంజయ్ మంజ్రేకర్ (50), దిలీప్ వెంగ్‌సర్కార్ (32), మహ్మద్ అజారుద్దీన్ (11) పెవిలియన్‌కు చేరుకున్నారు. 🏏 భారత్‌పై ఓటమి ప్రమాదం పొంచి ఉంది. 🙏