🏢 ఇటీవల హాప్పర్ హెడ్‌క్వార్టర్స్ అనే వార్తా సంస్థ.. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక కమర్షియల్ పోస్ట్ ద్వారా రూ. 11.45 కోట్లు సంపాదిస్తున్నట్లు పేర్కొంది. 🌐📈
ఇక ఇది కాస్తా క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అలాగే కొందరు ఈ వార్తపై మీమ్స్ కూడా చేశారు. 😄💬 దానితో స్వయంగా కోహ్లినే స్పందిస్తూ.. ఈ వార్తపై క్లారిటీ ఇచ్చాడు. 🗣️👍 ‘నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారం అవుతున్న వార్తలు నిజం కాదు. జీవితంలో నేను సాధించిన విజయాలకు మీకు రుణపడి ఉన్నాను’ అని ట్వీట్ చేశాడు. 📢
📱 ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆసియన్లలో కోహ్లి మొదటిస్థానంలో ఉన్నట్టు ఆ సంస్థ నివేదికలో పేర్కొంది. 📄 ఈ నివేదిక ప్రకారం, పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌తో అత్యధిక డబ్బును సంపాదిస్తున్న ఆటగాడిగా మొదటి స్థానంలో ఉండగా.. 🥇 లియోనెల్ మెస్సీ రెండో స్థానం, ఈ లిస్ట్‌లో విరాట్ మూడో స్థానంలో ఉన్నట్టు చెప్పింది. 🥈🥉 ఇక కోహ్లి తర్వాత బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రూ.4.4 కోట్లు సంపాదించిందని తెలిపింది. 💃📸