top of page

తేలికగా తీసుకుంటే మూల్యం చెల్లించాల్సిందే.. 😔

మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ గట్టి పోటీదారేమీ కాదు. 🏏 అయితే ఈ జట్టును పసికూనగా అని తేలికంగా తీసుకుంటే మాత్రం నూకలు చెల్లించాల్సిందే.

ఎందుకంటే ఈ జట్టు ఛాంపియన్‌గా మారలేకపోవచ్చు కానీ తనదైన రోజున ఎలాంటి జట్లనైనా ఓడిస్తుంది. 🏆🏃‍♂️ గతంలో ఇది చాలా సార్లు నిరూపితమైంది. పైగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి ఉండేది. 🏏🌍 కానీ ఇప్పుడు ఆ టీమ్‌ లో 6 నుండి 7 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. 🥇🏆 బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు అద్భుతంగా ఉంది. 🏏🎯 ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ విభాగం ప్రపంచంలోని ఏ బ్యాటర్లనైనా ముప్పతిప్పలు పెట్టగలదు. 🌐🕳️ ప్రపంచ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 7న ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది అఫ్ఘానిస్థాన్. 🇦🇫 మరి ఈ జట్టు బలాలు, బలహీనతల ప్రపంచకప్‌ పూర్తి షెడ్యూల్‌ను కూడా తెలుసుకుందాం రండి. 🗓️🏏 బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ బ్యాలెన్స్ ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద బలం. 💪🌟 హష్మతుల్లా షాహిదీ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. 🙌🏏 అతనికి తోడుగా బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్ద మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. 🥇🏏 టాప్ ఆర్డర్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ వంటి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. 🏏🌟 వీరు వేగంగా పరుగులు చేయడంలో దిట్ట. 🏃💨 మిడిలార్డర్‌లలో నజీబుల్లా జద్రాన్ లాంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నాడు. 🏏🌟 ఆల్‌రౌండర్‌లలో మహ్మద్‌ నబీ ఆ జట్టుకు అదనపు బలం. 💪🏏 బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ మ్యాచ్‌లను గెలిపించగల శక్తి అతనికి ఉంది. 🥳🏆

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page