top of page

🇮🇳🏏 భారత సైన్యంలో పనిచేసిన ఆటగాళ్లు వీరే..🏏🇮🇳

🏏 భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 🏏

భారత వైమానిక దళంతో అనుబంధం కలిగి ఉన్నాడు. 2010లో సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ హోదాను ప్రదానం చేసింది.

🏆 భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 🏆

భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీకి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ అందించారు. భారత మాజీ కెప్టెన్ 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యంలోనూ పనిచేశాడు.

🥇 భారత షూటర్ అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. 🥇

10 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో ఈ బంగారు పతకాన్ని సాధించాడు. 2011 సంవత్సరంలో, అభినవ్ బింద్రాకు ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ లభించింది.

🏅 రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. 🏅

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 1990లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాడు. 2013 సంవత్సరం వరకు భారత సైన్యంతో సంబంధం కలిగి ఉన్నాడు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రాజకీయాల వైపు మళ్లారు.

🏏 1983లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 🏏

భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్. కపిల్ దేవ్‌కు 2008లో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. కపిల్ దేవ్ పంజాబ్ రెజిమెంట్‌లో చేరి ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు. 🇮🇳💪

Comments


bottom of page