top of page

భారీ సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్..🏏🌟

అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ (32) ఆకట్టుకున్నా ఒక చక్కటి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అక్షర్ పటేల్ 27 పరుగులు, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 17 పరుగుల చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ తలా ఒక వికెట్ తీశారు.

ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (179)కు తోడుగా వెటరన్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్ 5 పరుగులతో ఉన్నాడు. రెండో రోజు వీరిద్దరూ ఎంత సేపు బ్యాటింగ్‌ చేయనున్నారనే దానిపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి. కాగా రెండో రోజు డబుల్ సెంచరీ సాధిస్తానని యశస్వి జైస్వాల్ ధీమాగా చెబుతున్నాడు. 172 పరుగులు చేసిన అతను ఈ మ్యాచ్‌లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు (171)ను అధిగమించాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానులు మరుసటి రోజు యశస్వి నుండి డబుల్ సెంచరీని ఆశిస్తున్నారు. 🏏🎉


bottom of page