top of page

🏏🇮🇳 'భారత్ vs ఆస్ట్రేలియా' వన్డేల్లో పరుగుల వీరులు వీరే..🏏🇮🇳

‘భారత్ vs ఆస్ట్రేలియా’ వన్డేల్లో ఆసీస్‌పై 71 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 44.59 యావరేజ్, 84.71 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 3077 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. 🏏🇮🇳

సచిన్ తర్వాత ‘భారత్ vs ఆస్ట్రేలియా’ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ కంగారులతో 42 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో మొత్తం 2251 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ తన తొలి డబుల్ సెంచరీ(209)ని ఆస్ట్రేలియాపైనే చేయడం గమనార్హం. 🏏🇦🇺

ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియాపై విరుచుకుపడే విరాట్ కోహ్లీ లేకుండా ఈ లిస్టు పూర్తి కాదు కదా..! ‘భారత్ vs ఆస్ట్రేలియా’ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఆసీస్‌పై 46 మ్యాచ్‌లు ఆడి 52.97 యావరేజ్, 95.34 స్ట్రైక్‌రేట్, 8 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో మొత్తం 2172 పరుగులు చేశాడు. 🏏🇮🇳

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ లిస్టు 5వ స్థానంలో ఉన్నాడు. ధోని కంగారుల జట్టుపై 55 మ్యాచ్‌ల్లో 1660 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ధోని యావరేజ్ 44.86, స్ట్రైక్‌రేట్ 80.89గా ఉండగా.. అతని పేరిట 2 సెంచరీుల, 11 హాష్ సెంచరీలు ఉన్నాయి. 🏏🇮🇳

Комментарии


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page