top of page

🏏🌟 టీమిండియాకి ఆ ముగ్గురే దిక్కు.. ఎవరంటే.?🌟🏏

🏏 టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉప్పల్‌ గ్రౌండ్ ప్రత్యేకం. టెస్టుల్లో 379 పరుగులు చేశాడు. ఓ డబుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు విరాట్.

తనకు అచ్చొచ్చిన ఉప్పల్‌లో విరాట్ ఈసారి మ్యాచ్‌ ఆడటం లేదు. వెటరన్‌ టెస్టు బ్యాటర్‌ పుజారాకు ఇక్కడ గొప్ప రికార్డు ఉంది. పుజారా సైతం ఇక్కడ డబుల్ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లో చూసుకుంటే ఉప్పల్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకూ టెస్టుల్లో ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే. అశ్విన్, జడేజా, ప్రజ్ఞాన్ ఓజా, ఉమేష్‌ యాదవ్, హర్భజన్‌కు ఉప్పల్ అచ్చొచ్చిన గ్రౌండ్. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లోనూ.. భారత్‌ విజయఢంకా మోగించాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

🏏 మొదటి టెస్టుకు భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రీకర్ భరత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 🏏🌟

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page