top of page

🏏 ముంబై ఇండియన్స్‌లో ఇకపై రోహిత్ పాత్ర ఇదే 🏏

🔍 **ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకున్నప్పటి నుంచి, ఒక ప్రశ్న నిరంతరం చర్చిల్లోకి వస్తోంది.

ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ ఎలాంటి పాత్ర పోషిస్తాడనేది ఆ ప్రశ్న. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా పలువురు క్రికెట్ నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు ముంబై ఇండియన్స్ గ్లోబల్ క్రికెట్ హెడ్ మహేల జయవర్ధనే సమాధానమిచ్చాడు. రోహిత్ పాత్రను వివరించడానికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పాత్రను తీసుకున్నారు.

👉 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు కీలక పాత్ర పోషించినట్లు, రోహిత్ శర్మ కూడా అదే పాత్ర పోషిస్తాడని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఈ వెటరన్ శ్రీలంక క్రికెటర్ మాట్లాడుతూ, ‘రోహిత్ మైదానంలో, వెలుపల జట్టులో ఉండటం ముంబై ఇండియన్స్ తరువాతి తరానికి మార్గనిర్దేశం చేయడంలో మాకు సహాయపడుతుంది. అతను చాలా తెలివైన క్రికెటర్. రోహిత్‌తో చాలా సన్నిహితంగా పనిచేశాను. అతను కూడా అసాధారణ మానవుడు. మార్గదర్శక వెలుగుగా పనిచేసే ముంబై ఇండియన్స్ వారసత్వంలో అతను భాగమవుతాడని నాకు నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. 🌟👏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page