ఆసియాకప్‌నకి ముందు సిరాజ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 🇮🇳 శ్రీలంకతో మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 🏆
దీంతో క్రికెట్ చరిత్రలో తనపేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. 📜 ఈ క్రమంలో ఏకంగా 8స్థానాలు మెరుగుపరుచుకుని నెంబర్ వన్ ప్లేస్‌ని సొంతం చేసుకున్నాడు. 🥇 దీంతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి, రషీద్ ఖాన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నారు. 🏏 టాప్ 10లో భారత్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 🙌 టాప్ 10లో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్ 10 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకోగా, ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ వోక్స్ (11వ స్థానం), దక్షిణాఫ్రికాకు చెందిన లుంగి ఎన్‌గిడి (21వ స్థానం) కూడా లాభపడ్డారు. 🏆🌍🏴🇿🇦🇮🇳