టీమిండియా మాజీ గూగ్లీ స్పిన్నర్, ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న పీయూష్ చావ్లా తన కెరీర్‌లో 1000 వికెట్లు పూర్తి చేసిన రికార్డును లిఖించాడు. 🏆💯
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ తరపున ఆడుతున్న పీయూష్ చావ్లా.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 1 ఓవర్ మెయిడిన్ కూడా ఉంది. దీంతో తన క్రికెట్ కెరీర్‌లో 1000 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 🏏💪
పీయూష్ చావ్లా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 445 వికెట్లు, టీ20 క్రికెట్‌లో 302 వికెట్లు, లిస్ట్-ఎ క్రికెట్‌లో 254 వికెట్లు తీశాడు. దీంతో ఇప్పుడు అతని పేరిట 1001 వికెట్లు నమోదయ్యాయి. 🌟🎉
ఐపీఎల్ 2023 వేలంలో అతడిని ముంబై ఇండియన్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. దీని తర్వాత, అతను IPL 2023లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబై తరపున 16 మ్యాచ్‌లలో 18 వికెట్లు పడగొట్టాడు. 🏆
పీయూష్ చావ్లా భారత్ తరనెన మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు. అతను 2006లో టీమ్ ఇండియా తరపున తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే గత 12 ఏళ్లుగా చావ్లాకు టీమ్ ఇండియాలో అవకాశం రాలేదు. చావ్లా భారత్ తరపున 2 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. 🇮🇳🏏