ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
జోష్ ఇంగ్లిస్ అద్భుత సెంచరీతో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 208/3 స్కోరు చేసింది. ఆపై సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 80 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఇక ఇప్పుడు రెండో టీ20 కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం (నవంబర్ 26) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్యూవెదర్ ప్రకారం, నవంబర్ 26న తిరువనంతపురంలో 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. 🏏🌧️