top of page
Shiva YT

🏏 చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో..భారత్‌🏏

🏏 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్లు ఆస్ట్రేలియాను 199 పరుగులకే పరిమితం చేశారు.

అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

🏆 భారత్ రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఈ ఛాలెంజ్‌ని 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

🇮🇳 భారత్ తన మూడో మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ కేవలం 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. అనంతరం టీమిండియా 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలతో రాణించారు.

🏏 భారత్ ఐదో మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగింది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సవాలును పూర్తి చేసింది. విరాట్ కోహ్లీ 103 నాటౌట్, శుభ్‌మన్ గిల్ 53, రోహిత్ శర్మ 48 పరుగులు చేశారు.

🏏 ఇక కీలకమైన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌటైంది. దీంతో 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది రోహిత్ సేన. 🇮🇳


bottom of page