top of page

ఆ విషయంలో రోహిత్ శర్మ ఛీటింగ్ చేశాడు: 🏏🇮🇳

భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ కీలక ఆరోపణలు చేశాడు. టాస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మోసపూరితంగా వ్యవహరించాడని ఆరోపించాడు.

సికందర్ బఖ్త్ ప్రకారం.. రోహిత్ శర్మ నాణేన్ని విసిరినప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా దానిని ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చూడలేనంత దూరం విసిరాడు’ అంటూ ఆరోపణలు గుప్పించాడు. 🤨🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿

2023 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. భారత్ తరపున విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేయగా, మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న టీమ్ ఇండియా 397 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

ఈసారి పాకిస్థాన్ భారత్‌పై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టోర్నీ మధ్యలో పాక్ మాజీ క్రికెటర్లలో ఒకరైన హసన్ రజా కూడా పిచ్, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశాడు. భారత బౌలర్లకు వేరే బంతిని ఇస్తున్నారని, ఆ బంతి నుంచి భారత బౌలర్లు స్వింగ్, సీమ్ పొందారంటూ చెప్పుకోవచ్చు. ఇది కాకుండా, బ్యాటింగ్ చేసే సమయంలోనూ పిచ్ కూడా భిన్నంగా ఉంటుందంటూ కీలక ఆరోపణలు చేశాడు. 🤔🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page