top of page
Shiva YT

🏏 క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్..

🔥 ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అతను క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టే అంచున ఉన్నాడు.

🏆 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చివరి 8 లీగ్ మ్యాచ్‌ల్లో 22 సిక్సర్లు కొట్టాడు. అతని ఫామ్‌ను బట్టి చూస్తే నెదర్లాండ్స్‌పై కూడా అతని బ్యాట్ మెరుపులు కురిపించే అవకాశాలున్నాయి.


🏏 నెదర్లాండ్స్‌పై రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టినట్లయితే, అతను ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతాడు.


🏏 2015లో మొత్తం 26 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ ఒక్క ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


🏏 అలాగే, ఒక సిక్సర్ కొట్టడం ద్వారా, వన్డే ప్రపంచకప్‌లో ఒక ఎడిషన్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్‌ను అధిగమించే అవకాశం రోహిత్‌కి ఉంది.


🏏 ఒక ఎడిషన్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్ ఉన్నాడు. 2023 ప్రపంచకప్‌లో మాక్స్‌వెల్ ఇప్పటివరకు 22 సిక్సర్లు బాదాడు.


🏏 అతని తర్వాత 22 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా అదే సంఖ్యలో సిక్సర్లు కొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు బెంగళూరులో రోహిత్ రెండు సెంచరీలు సాధించాడు. అదే మైదానంలో ఆస్ట్రేలియాపై 9 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది.

bottom of page