🏏 "2023 ప్రపంచ కప్ (ICC World Cup 2023) టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ పేలవ ఫాంతో ఇబ్బంది పడ్డాడు. 🏏
గత రెండు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పెవిలియన చేరాడు. 🏏 కానీ, గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అయ్యర్ తన పాత ఫామ్‌లో కనిపించాడు. 🏏 శ్రీలంకపై హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ 106 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు. 🏏 ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యంత పొడవైన సిక్స్.
🔥 106 మీటర్ల సిక్స్.. 🔥 ఇదే ప్రపంచకప్‌లో 101 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టిన అయ్యర్.. పొడవైన సిక్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. 🔥 అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై తుఫాన్ సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా జట్టు డేంజరస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్.. 104 మీటర్ల పొడవైన సిక్సర్‌తో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 🔥 ఇక మరోసారి లంకపై చెలరేగిన అయ్యర్.. 106 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టి.. మళ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 🔥"