top of page

🏏 సెంచరీల కోసం కాదు.. దేశం కోసమే ఆడతాడు: హిట్‌మ్యాన్‌పై గంభీర్ ప్రశంసలు.

🏏 భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసల వర్షం కురిపించాడు. 🎉 రోహిత్ శర్మను కొనియాడుతూ, ఇప్పటికే కెప్టెన్ రోహిత్ 40-45 సెంచరీలు చేసి ఉండేవాడంటూ తెలిపాడు. 🏆

అయితే అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు. 🇮🇳 అతను వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు ప్రదర్శనపై దృష్టి పెడతాడంటూ తేల్చి పారేశాడు. 🏅

🏏 రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 257 మ్యాచ్‌లు ఆడాడు. 🏏 ఈ కాలంలో అతను 31 సెంచరీలు చేశాడు. 🎯 అతని పేరిట 54 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 🏆 వన్డే క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 🌟

🏏 ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మకు సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అతను ఔటయ్యాడు. 🏟 తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభం అంతగా రాణించకపోవడంతో భారత జట్టు 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 🏆

🏏 అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్‌కు 91 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 🙌 అయితే ఈ జోడీ సెట్ అయ్యి జట్టును భారీ స్కోరుకు తీసుకెళ్తుందని అనిపించినప్పుడు, కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. 🏆 రోహిత్ శర్మ 87 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 🎖️

🏏 రోహిత్ శర్మ ఇప్పటికి 40-45 సెంచరీలు చేసి ఉండేవాడు. 🏏 కానీ, సెంచరీలను అంతగా పట్టించుకోడు. 🙏 అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు. 🏏 ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. 🌠 అతను ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. 🌟 ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇలాగే దూసుకపోవాలని తెలిపాడు. 🇮🇳

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page