🏏 భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది.
దీంతో రోహిత్ సేనకు 257 పరుగుల టార్గెట్‌ను అందించింది. బంగ్లా బ్యాటర్లలో తస్జీద్ హసన్ 51, లిటన్ దాస్ 66 పరుగులతో ఆకట్టుకోగా, చివర్లో వచ్చిన మహ్మదుల్లా 46 పరుగులతో స్కోర్‌ను 250 దాటించడంలో సహాయపడ్డాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శార్దుల్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.
62 బంతుల్లో లిట్టన్ దాస్ అర్ధశతకం.. 🏏🌟 ఓపెనర్ లిట్టన్ దాస్ తన వన్డే కెరీర్‌లో 12వ అర్ధశతకం పూర్తి చేశాడు. 82 బంతుల్లో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను 80.49 స్ట్రైక్ రేట్‌తో 7 ఫోర్ల సహాయంతో పరుగులు చేసాడు.
ఓపెనర్ తాంజిద్ హసన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 🏏🌟 అతను తన వన్డే కెరీర్‌లో 41 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. 🏏🌟