top of page

భారత ప్లేయర్లకు మాత్రమే సొంతమైన ‘ప్రపంచ కప్’ రికార్డులు..

🏆 కపిల్ దేవ్: అతి పిన్న వయసులోనే వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌ కపిల్ దేవ్. భారత్ 1983 వరల్డ్ కప్ టైటిల్ గెలిచినప్పుడు కపిల్ వయసు 24 ఏళ్ల 170 రోజులు మాత్రమే. విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం జరిగే వరల్డ్ కప్ ఎడిషన్‌లో కూడా కపిల్ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేరు. ఎందుకంటే.. ఇప్పటి మెగా టోర్నీలోని 10 జట్ల కెప్టెన్‌లు అందరూ కనీసం 27 సంవత్సరాలు దాటినవారే. 🏏

🏏 సచిన్ టెండూల్కర్: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్ రికార్డ్ సృష్టించాడు. 9 సార్లు ఈ అవార్డ్ అందుకున్న సచిన్ పేరిట మరో రికార్డ్ కూడా ఉంది. ఒకే ఎడిషన్ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు యువరాజ్ సింగ్. 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ 673 పరుగులు చేశాడు. 🏏

🏏 యువరాజ్ సింగ్: ఏదైనా వరల్డ్ కప్ ఎడిషన్‌లో 350+ పరుగులు, 15 వికెట్లు తీసిన ఒకే ఒక్క ఆటగాడు యువరాజ్ సింగ్. 2011 వన్డే వరల్డ్ కప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' విన్నర్ యువరాజ్ 362 పరుగులు, 15 వికెట్లు తీశాడు. 🏏

🏏 విరాట్ కోహ్లీ: ఒకే ఎడిషన్‌ వన్డే వరల్డ్ కప్‌లో 5 సార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక కెప్టెన్‌ విరాట్ కోహ్లీ. 2019 ప్రపంచ కప్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించడమే కాక 443 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏ కెప్టెన్‌ కూడా ఈ విధమైన ప్రదర్శన కనబర్చలేదు. 🏏

🏏 రోహిత్ శర్మ: ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో 5 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. 2019 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో 5 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ మొత్తం 648 పరుగులు చేశాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్(673) రికార్డుకి 25 పరుగుల దూరంలోనే రోహిత్ ఆగిపోయాడు. 🏏

Bình luận


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page