🇵🇰 బాబర్ ఆజామ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఆ జట్టు ఇక్కడే రెండు వారాల పాటు ఉండబోతోంది. 🏏
సెప్టెంబర్ 29 (న్యూజిలాండ్), అక్టోబర్ 3 (ఆస్ట్రేలియా) రెండు వార్మప్ మ్యాచ్‌లు.. 🏆 లీగ్ ప్రారంభమైన అనంతరం అక్టోబర్ 6 (నెదర్లాండ్స్), అక్టోబర్ 10 (శ్రీలంక)న రెండు ప్రధాన మ్యాచ్‌లు ఆడనుంది పాకిస్తాన్ జట్టు. 🏏
🏟 శంషాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఘన స్వాగతం పలికారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు. ✈️ ఎయిర్‌పోర్ట్ నుంచి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ వరకు పటిష్ట భద్రత నడుమ నగర పోలీసులు పాక్ జట్టును తరలించారు. 👮♂️ మొహమ్మద్ నవాజ్, అగ సల్మాన్ తప్ప.. మిగిలిన పాక్ సభ్యులకు భారత్ రావడం ఇదే మొదటిసారి. 🤝 దీంతో వారికి ఇక్కడ లభించిన మర్యాద చూసి ఉబ్బితబ్బిబైపోయారు పాక్ క్రికెటర్లు. 🇮🇳
🌟 ఒక్క షాహీన్ షా అఫ్రిది మాత్రమే కాదు.. అతడి సహచర ఆటగాడైన మహమ్మద్ నవాజ్ కూడా ఘన స్వాగతానికి.. 🙌 సంబరపడిపోయి తన స్పందన సోషల్ మీడియాలో తెలియజేశాడు. 📱