🏆 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇదిలా ఉండగా.. దాయాది జట్టు పాకిస్తాన్ తన వార్మప్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో ఆడనుంది.
ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే న్యూజిలాండ్ జట్టులోని కొందరు ఆటగాళ్లు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకోగా.. మిగతా ప్లేయర్స్ బుధవారం నగరానికి చేరుకోనున్నారు. 🏟️ ఇక ఆలస్యంగా వీసాలు అందుకున్న పాకిస్తాన్ ప్లేయర్స్ దుబాయ్ మీదుగా బుధవారం రాత్రి 8.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. 🌃 హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్ హయత్ హోటల్‌లో పాక్ జట్టు వసతిని కల్పించగా.. న్యూజిలాండ్ జట్టుకు ఐటీసీ కాకతీయలో బసను ఏర్పాటు చేశారు. 🏨 వాస్తవానికి సెప్టెంబర్ 27న పాక్ జట్టు హైదరాబాద్ చేరుకోవాలి. కానీ పాక్ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి వీసాలు లేట్ కావడంతో.. హైదరాబాద్‌కు వారి రాక ఆలస్యమైంది. 🤦♂️
🕒 సుమారు 15 రోజుల పాటు పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లో ఉండనుంది. సెప్టెంబర్ 29న పాకిస్తాన్ తన మొదటి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలబడనుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 3న ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మూడు ప్రధాన మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్, అక్టోబర్ 9న కివీస్‌తో నెదర్లాండ్స్, అక్టోబర్ 10న శ్రీలంకతో పాకిస్తాన్ రాజీవ్ గాంధీ స్టేడియంలో తలబడనున్నాయి. 🌐🇵🇰🏏