🇨🇦 కెనడాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. 🌆
బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ శిక్షణ విమానం కూలింది. ఇందులో ఇద్దరు భారతీయ ట్రెయినీ పైలట్లు ఉన్నారు. ✈️ శిక్షణలో ఉన్న హైపర్ పీఏ-4 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్‌తో పాటు రాముగడె అనే మరో పైలట్ కూడా మృతి చెందారు. భారతీయ పైలట్లు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానిక మీడియా పేర్కొంది. 👨👩👧👦 ఈ ఘటనలో ఈ ముగ్గురు పైలట్లకు మినహా ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. 🚓 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి 5 అంబులెన్స్ లు చేరుకున్నాయి. 🚑 సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 🤷♂️ విమాన ప్రమాదంపై కెనడా ట్రాన్సుపోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ చేపట్టింది. 🛬🔍