top of page
Shiva YT

ఎనిమిది సార్లు గెలిచిన సీపీఎం కంచుకోటలో కాంగ్రెస్ పాగా.. 😊👏

భద్రాచలం అంటే సీపీఎం.. సీపీఎం అంటే భద్రాచలం.. 😄 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియోజక వర్గంలో సీపీఎం చెప్పిందే వేదం. 📜👨‍⚖️

ఒక విధంగా చెప్పాలంటే భద్రాచలం ఏజెన్సీని శాసించింది. 🏛️ ఎనిమిది సార్లు వరుస విజయాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. 🏆 భద్రాచలంలో ఎర్రజెండా రెప రెపలతో కంచుకోటగా మారింది. 🌄 1952 లో నియోజక వర్గం ఏర్పడింది. 🗳️ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నియోజక వర్గంగా ఉండేది. 🏢 పోలవరం ముంపు మండలాలు వీఆర్‌.పురం, చింతూరు, కూనవరం మండలాలు 2014 వరకు భద్రాచలం నియోజక వర్గంలో ఉండేవి. 🌟 ఉప ఎన్నికలతో కలుపుకుంటే 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 🗳️ 1978, 1983 లో ముర్ల ఎర్రయ్య రెడ్డి సీపీఎం తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 🏆 1985, 1989, 1994 లో కుంజా బుజ్జి సీపీఎం తరపున గెలిచారు. 🎉 ఆ తర్వాత 1999, 2004, 2014 లో సున్నం రాజయ్య సీపీఎం తరపున ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 🏆🌟 మొత్తం మీద ఎనిమిది సార్లు సీపీఎం పార్టీ విజయ ఢంకా మోగించింది. 🎊 ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాలకు సీపీఎం తమ అభ్యర్థులను ఖరారు చేసింది. 🗳️ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు సీట్లలో పోటీ చేస్తోంది. 🗳️ భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థిగా కారం పుల్లయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. 🏞️ దీంతో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య, బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు, దీంతో భద్రాచలంలో త్రిముఖ పోటీ నెలకొంది. 👥 గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్యకు 47,446 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు 35,961 ఓట్లు, సీపీఎం అభ్యర్థి మిడియం బాబురావుకు 14,224 ఓట్లు పోలయ్యాయి. 🗳️✨ 11,554 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య విజయం సాధించారు. 🥳🗳️

bottom of page