top of page
MediaFx

కరోనా ఎఫెక్ట్ తో మనుషుల ఆయుర్దాయం ఎంత తగ్గిందో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదిక ప్రకారం, కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం 1.5 సంవత్సరాలు తగ్గిపోయింది. గత పదేళ్లుగా పెరుగుతూ వచ్చిన భారతీయుల సగటు ఆయుర్దాయం, కరోనా ప్రభావం వల్ల ఒక్కసారిగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరింది.

కరోనా మహమ్మారికి ముందు, 2019లో భారత్‌లో పౌరుల సగటు ఆయుర్దాయం 73 ఏళ్లు ఉండేదని నివేదిక చెబుతోంది. రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావం వల్ల, పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం తగ్గిపోయింది. అలాగే, ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా 61 సంవత్సరాలకు తగ్గిపోయింది.

డబ్ల్యూహెచ్ వో విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితా ప్రకారం, అమెరికా, ఈశాన్య ఆసియాలో 2019 నుంచి 2021 మధ్య మనిషి ఆయుర్దాయం మూడేళ్లు తగ్గిపోయింది. అదే సమయంలో, ఆరోగ్యకరమైన జీవిత కాలం రెండున్నర సంవత్సరాలు తగ్గింది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో కరోనా ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో ఆయుర్దాయం ఏడాది కన్నా తక్కువగా, ఆరోగ్యకరమైన జీవన కాలం రెండేళ్ల కన్నా తక్కువగా తగ్గింది.

bottom of page