top of page

🦠📈తెలంగాణలో కలకలం రేపుతోన్న కరోనా..ఇద్దరు మృతి..?🌐

🌇🌆గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గత కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉన్న మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. గత వారం రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 45, రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

🌇🌆గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గత కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉన్న మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. గత వారం రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 45, రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అంతకంత కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,333 పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అవన్నీ హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 59 మంది కరోనా చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త వెరియంట్‌తో భయం లేదని నిపుణులు చెబుతున్నా.. కోవిడ్ మరణాలు కలకలం రేపుతున్నాయి.

ఆ ఇద్దరి మృతికి వైరస్‌ కారణం కాదు

ఉస్మానియాలోని ఎమర్జెన్సీ వార్డులో తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం చేరినవారిలో ఇద్దరు తాజాగా మృతి చెందారు. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి డిసెంబర్‌ 14న ఉస్మానియాలో చేరాడు. గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో అతను చికిత్స పొందుతూ డిసెంబర్‌ 24న మృతి చెందాడు. 42 ఏళ్ల మరో వ్యక్తి కిడ్నీ వైఫల్యంతో ఈ నెల 22న చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే సాధారణ పరీక్షల్లో భాగంగా వీరిద్దరికి కరోనా టెస్టులూ చేయగా ఇద్దరికీ పాజిటివ్‌ లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. అయితే వారు కరోనాతో మృతి చెందలేదనీ, అప్పటికే వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆ కారణంగానే మృతి చెందారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు.

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో మరో ముగ్గురు రోగులు కరోనాతో ఐసొలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నగరంలో కరోనా కేసుల పెరుగుతుండటంతో ఉస్మానియా ఆసుపత్రిలో 50, గాంధీలో 50 పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు.🦠📈

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page