ఈ సమావేశాన్ని ప్రారంభిస్తూ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ.. ‘మహిళల భద్రత కోసం చేస్తున్న చట్టాలు సద్వినియోగం కాకపోవటం వల్ల దుర్వినియోగం అవుతున్నాయని దీనిని సాకుగా చూపి కొత్త చట్టాలు
చేయటానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి’ అని అన్నారు. స్త్రీలకు తమ శరీరంపై వారికి హక్కు ఉందని, ఇష్టం లేకుండా భర్త అయినా లైంగిక చర్య చేస్తే రేప్ కేసులు నమోదు చేయటం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు. స్త్రీల హక్కులను పరిరక్షిస్తూ వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు గురికాకుండా అవగాహన, సామాజిక చైతన్యంతో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాల్ని కోరారు. మహిళా కమిషన్ సభ్యులు లైంగిక సంబంధాల విషయంలో భార్యలపై దాష్టికం జరుగుతున్న కేసులను వివరించారు. భర్తలపై రేప్ కేసులు నమోదు చేసే విషయంలో చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయని.. అవగాహనతో కూడిన అంశం అయినందున చట్టంగా రూపొందించే విషయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉంటుందని మహిళా కమిషన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 💬🌐