top of page

మేడారం హుండీల లెక్కింపు..🎉🕊️

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతర పూర్తి అయింది. రెండేళ్లకోసారి జరిగే ఈ యాత్రలో అడవి బిడ్డలతో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. వనాలను వీడి జానాల మధ్యకు వచ్చే సమ్మక్క, సారలమ్మని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సమ్మక్క, సారలమ్మ జాతరకుకూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.

తాజాగా సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతుంది. హనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీలను లెక్కిస్తున్నారు. మూడోరోజు మేడారం హుండీలను లెక్కిస్తే.. 3.46 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు 317హుండీల లెక్కించగా.. 9.60కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఈఓ రాజేంద్రం.

ఇక రెండో రోజు శుక్రవారం 2కోట్ల 98 లక్షల35 వేలు ఆదాయం లభించింది. 71 ఐరన్‌ హుండీల్లోని కరెన్సీ, చిల్లర నాణెలు, వెండి, బంగారం వేరు చేశారు. మొదటిరోజు 3 కోట్ల15 లక్షల 40వేలు ఆదాయం వచ్చింది. మొత్తం మూడు రోజులు కలిపి 9.60కోట్ల రూపాయల ఆదాయం రాగా.. ఈ నగదును బ్యాంకులో జమ చేశామని ఈవో వివరించారు. 💰🏦

Comments


bottom of page