top of page
MediaFx

భార్యపై అవినీతి ఆరోపణలు.. పదవికి స్పెయిన్ ప్రధాని రాజీనామా


భార్యపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో స్పెయిన్ ప్రధాన మంత్రి ఫెడ్రో శాంచెజ్ పదవి నుంచి తప్పుకున్నారు. తన భార్య బెగోనా గోమెజ్‌పై అక్రమాస్తుల కూడబెట్టారనే అనుమానంతో కోర్టు విచారణ ప్రారంభించిన తర్వాత రాజీనామా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం తెలిపారు. ‘నేను ప్రభుత్వానికి నాయకత్వం వహించాలా లేదా నేను ఈ గౌరవాన్ని వదులుకోవాలా అని నిర్ణయించుకోవడానికి నేను కాసేపు ఆలోచించాలి’ అని ఆయన ఇటీవల ఎక్స్‌లో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నారు. సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని, అప్పటి వరకు తన షెడ్యూల్‌ను నిలిపివేస్తానని ఆయన తెలిపారు.బెగోనా గోమెజ్‌పై వచ్చిన నేరారోపణలు, అవినీతిపై దర్యాప్తు ప్రారంభించినట్టు మాడ్రిడ్ న్యాయస్థానం బుధవారం వెల్లడించింది. బెగోన్‌పై మానోస్ లింపియాస్ (క్లీన్ హ్యాండ్స్) అనే అవినీతి వ్యతిరేక గ్రూప్ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిధులు లేదా కాంట్రాక్టులను పొందిన అనేక ప్రైవేట్ కంపెనీలతో గోమెజ్‌కు ఉన్న సంబంధాలను అధికారులు విచారిస్తున్నారని ఆన్‌లైన్ వార్తా సంస్థ ఎల్ కాన్ఫిడెన్షియల్ నివేదించిన కొద్ది గంటల్లోనే కోర్టు ప్రకటన వెలువడటం గమనార్హం.


bottom of page