top of page
Shiva YT

భారత్‌లోకి ప్రవేశించిన కోవిడ్‌ కొత్త వేరియంట్‌.. 🦠🆕 ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా?

కోవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తించి రెండు నెలలు గడిచినా జూన్‌, జులైలో కోవిడ్‌ కేసుల్లో పెరుగుదల కనిపించలేదు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. జులై చివరి నాటికి యాక్టివ్‌ కేసుల సంఖ్య 70గా ఉండగా ఆగస్టు నాటికి ఈ సంఖ్య 115కి పెరిగింది.

తాజాగా సోమవారం మహారాష్ట్రాలో కరోనా కేసులు 109కి చేరింది. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసుల పెరుగుదలను జులై 31న అధికారికంగా గుర్తించారు. వైద్యాధికారుల లెక్కల ప్రకారం.. ముంబైలో గరిష్టంగా 43 కేసులు, పుణెలో 34, థానేలో 25 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాయ్‌ఘఢ్‌, సాంగ్లీ, షోలాపూర్, సతారా, పాల్ఘర్‌లో ఒక్కో యాక్టివ్‌ కేసు నమోదైంది. ఇదిలా ఉంటే పుణెలో గడిచిన 15 రోజుల్లో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే నమోదైన 10 కేసుల్లో తేలికపాటి లక్షణాలు కనిపించినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని ఆసుపత్రిలో చేరడం, ఐసీయూలో చేర్చడం వంటి పరిస్థితి రాలేదని చెబుతున్నారు. 😷📊

bottom of page