top of page

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.! 🦠😷

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలేలా లేదు. ఎంత దూరం తరిమికొడుతున్నా కొత్త రూపం సంతరించుకొని అది మళ్లీ, మళ్లీ మన మీద దాడి చేస్తూనే ఉంది. 2020-21 మధ్యకాలంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. యావత్ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది.

అయితే.. క్రమంగా ఈ వైరస్ ప్రభావం తగ్గడంతో, దీన్నుంచి విముక్తి కలిగిందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ కరోనా న్యూస్.. సింగపూర్ ను టెన్షన్ పెడుతోంది. కరోనా పూర్తిగా కనుమరుగు కాకపోయినా.. జనాలు ఈ వైరస్‌తోనే కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడే ఆ వైరస్.. తన రూపాల్ని మార్చుకొంటూ, ప్రపంచంపై తిరిగి దాడి చేయడం మొదలుపెట్టింది. తాజాగా సింగపూర్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం 32 వేల 35 కొత్త కరోనా కేసులు నమోదు కాగా ఈ వారం ఏకంగా 56 వేల 43 కొత్త కేసులు నమోదయ్యాయి. సో.. గత వారం కన్నా ఈ వారం కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిందని అర్థమవుతోంది.

సింగపూర్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చే యాత్రికుల కోసం అడ్వయిజరీ జారీ చేసింది ఆ దేశ ఆరోగ్యశాఖ. కొవిడ్‌-19 కేసులు మళ్లీ పెరుగుతున్నందున టూరిస్టులు, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రాంతాలలో ముఖానికి మాస్క్‌ ధరించాలనీ, అస్వస్థతకు గురైన వారిని సందర్శించేటపుడు మాస్క్‌ ధరించాలని సిఫార్సు చేసింది. విమాన ప్రయాణాలు చేసేవారు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, ప్రయాణంలో ఆరోగ్య బీమా తీసుకోవాలని సింగపూర్‌ సర్కారు కోరింది. దేశంలో కొత్త కేసులు గత వారం కంటే 75 శాతం పెరిగాయని పేర్కొంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు.. ఫ్లూ టీకాలను, కొవిడ్‌ బూస్టర్‌ డోసులను తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. 💉💊👩‍⚕️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page