కరోనా వైరస్ లేదా కోవిద్ -19 ప్రస్తుతము ప్రపంచమును ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రతిఒక్క దేశము ఈవ్యాధి మహమ్మారి బారినపడినది. ప్రతిరోజు పదుల్లో కొత్తవారికి వ్యాధి సంక్రమిస్తున్నది. రండి కరోనా వైరస్ గురించి పూర్తిసమాచారమును తెలుసుకుందాము. జ్యోతిష్యశాస్త్ర ఆధారముగా పూర్తినివేదిక మరియు పరిహారములు తెలుసుకుందాము.
కరోనా వైరస్: ఏమిటిది? కరోనా వైరస్ అనేది వైరస్ అనే పెద్దజాతి సమూహమునుండి వచ్చినది. చైనా కాకుండా, మొత్తము 73దేశములు ప్రస్తుతము ఈ వ్యాధిబారిన పడ్డాయి. ఇదిత్వరగా వ్యాప్తిచెందుతుంది మరియు ఇటువంటిది ఇంతకుముందు లేదు. పరిశోధనల ఆధారముగా కరోనా వైరస్ మొత్తము శరీరముపై ప్రభావమును చూపెడుతుంది. మనుషులకే కాకుండా జంతువులుకూడా ఈవ్యాధిబారిన పడ్డారు. ఇది డిసెంబర్ 2019లో వహన్ సిటీలో కనుగొనబడినది. WHO ప్రకారము, ఇప్పటిదాకా దీనికి ఎటువంటి నివారణ కనుగొనలేకపోయారు. కరోనా వైరస్ తొందరగా వ్యాప్తిచెందుతుంది.ఇది ప్రపంచము మొత్తము విస్తరించే అవకాశమున్నది. అనేక దేశములు భారతదేశముతోసహా బాధింపబడుతున్నవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారము, ప్రపంచం మొత్తముమీద సుమారు 10లక్షలమంది ఈవ్యాధి బారినపడినట్లు మరియు సుమారు 5000మంది ఈవ్యాధితో పోరాడి మరణించినట్లు తెలుస్తున్నది.
కరోనా వైరస్ లక్షణములు
కరోనా వైరస్ యొక్క లక్షణములు చాలా సాధారణముగా ఉంటాయి. అందుకనే, దానిని కనిపెట్టుట కష్టముతో కూడుకున్న పని. కరోనా వైరస్ లక్షణములు జ్వరము, జలుబు, దగ్గు, మరియు శ్వాస సంబంధిత సమస్యలు లక్షణములుగా ఉంటాయి. కావున, మీకు సాధారణ జ్వరము వచ్చిన, మీరు డాక్టరును సంప్రదించి సరైన పరీక్షలు జరిపించుకొని ఆయొక్క లక్షణములను నిర్ధారించుకోండి.
కరోనా వైరస్ & జ్యోతిష్యశాస్త్రము
ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) తెలిపినది ఏమనగా, ఈ వైరస్ ఎక్కువగా సీఫుడ్ తినటంవల్ల వస్తున్నట్లు తెలిపినది. పంచభూతములపట్ల మనుష్య జీవనము ఎలా ఉంటున్నదో జ్యోతిష్య శాస్త్రము ద్వారా తెలుసుకొనవచ్చును. కరోనా వైరస్ యొక్క జ్యోతిష్య శాస్త్ర విషయాలను తెలుసుకుందాము:
ఏ ఒక్క వ్యాధికూడా ఒక్కగ్రహము వలన ప్రభావితము చేయబడదు.కానీ, అనేక గ్రహముల యొక్క కలయిక మరియు రాశులయొక్క ప్రభావమువలన జరుగుతుంది.
చంద్రుని యొక్క ప్రభావము వ్యాధి విస్తరించడానికి పూర్తిగా ఉంటుంది.కారణము, చంద్రుడు సముద్రమునకు మరియు సముద్ర సంబంధిత సంపదకు అధిపతిగా ఉంటాడు.
ఇదేకాకుండా, రాహుకేతువులు కూడా వైరల్ వ్యాధులను వ్యాప్తిచెందించటంలో ముఖ్యపాత్ర పోషిస్తారు మరియు శని మరియు కుజుని యొక్క ప్రభావమువలన బుధుడుకూడా ముఖ్యపాత్ర పోషిస్తాడు.
సూర్యుడు సాధారణముగా ఆరోగ్యానికి, శక్తికి, దృఢత్వానికి ప్రతికగా ఉంటాడు. కానీ, సంచార సమయములో సూర్యుడు బలహీనంగా ఉంటె, ఇటువంటి వ్యాధులు అధికముగా వృద్ధిచెందుతాయి.
ప్రస్తుతము, సూర్యుడు జనవరిలో శనిచేత పాలింపబడుతున్నరాశిలో సంచరించాడు.అనగా ఫిబ్రవరి మధ్యవరకు మకరములో తరువాత మార్చ్ మధ్యవరకు కుంభంలో సంచరిస్తాడు.సూర్యుడు ఈశనియొక్క ప్రభావమువలన బలహీనంగా ఉన్నాడు.
కరోనావైరస్ యొక్క లక్షణములు కూడా నిమోనియా లక్షణములుగానే ఉంటాయి.దీనికి బుధుడు ముఖ్యభూమికను పోషిస్తాడు మరియు కారణమవుతాడు.
గురుడు విస్తరించడానికి సూచికగా ఉంటాడు.అనగా, పెరుగుట, వ్యాప్తిచెందుట, వంటివి.కావున గురుడుకూడా ఈవ్యాధి విస్తరించుటలో ముఖ్యభూమిక పోషిస్తాడు.
గురు మరియు కేతుల కలయిక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నది.
గురుడు బలహీనమైన స్థానములో ఉండుట మరియు రాహు కేతు యొక్క ప్రభావము ఉండుటవలన ఈవ్యాధి తొందరగా వ్యాప్తి చెందుతుంది.
మిథునరాశి గొంతు సంబంధిత వ్యాధులను తెలియచేస్తుంది.కర్కాటకరాశి ఊపిరితిత్తులు మరియు ఇతర వ్యాధులను తెలియచేస్తుంది.కావున ఇటువంటివాటిలో మిథున మరియు కర్కాటకరాశి ముఖ్యభూమికను పోషిస్తాయి.
ప్రస్తుతము రాహువు మిథునరాశిలో, కుజుడు ధనసురాశిలో సంచరిస్తుండటం వలన మరియు కేతువు మిథున మరియు కర్కాటకరాశిపై ప్రభావము చూపెడుతుండటం వలన, ఈరెండు రాశులు ప్రభావానికి గురిఅవుతాయి.
వైద్య నివేదికలు తెలుపుతున్నది ఏమనగా ఎక్కువగా, ఈవ్యాధి బారినపడినవారు డయాబెటిక్ సమస్యలు డిప్రెషన్లో ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు.
పైన తెలుపబడిన పరిస్థితులు ఈవ్యాధిని వ్యాప్తి చెందించటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
భారతదేశములో కొరోనా వైరస్:
కరోనా మహమ్మారి, ప్రపంచమును మొత్తాన్ని గడగడలాడిస్తున్నది, ఇప్పుడు భారతదేశములోకి ప్రవేశించినది. 70మందికిపైగా భారతదేశములో ఈవ్యాధి బారిన పడినవారు ఉన్నారు. రోగులు మరింత పెరిగే సూచనలు ఉన్నవి. రండి ముందుగా భారతదెశ జాతకమును చూద్దాము.
76సం వయస్సుగల వృద్ధుడు ఈవ్యాధి బారినపడి ఇప్పటికే మృతి చెందాడు. ఢిల్లీ మరియు హర్యానా నగరములో ఇప్పటికే అత్యవసర పరిస్థితులను ఎదురుకుంటునారు. మిగిలినరాష్ట్రాల్లో కూడా, అనగా ఒడిశాలో దీనిని హెల్త్ ఎమర్జెన్సీ విధించి తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమానయాన ప్రయాణాలలో ఆంక్షలను విధించారు. ప్రభుత్వము ప్రజలను రద్దీగల ప్రదేశములలో తిరగవద్దని ఆదేశించింది. ప్రయాణాలను వాయిదా వేసుకొనుట మంచిది. రండి భారతదేశ కుండలిని తెలుసుకుందాము:
భారతదేశ కుండలి ప్రకారము, వృషభలగ్నము మరియు కర్కాటక రాశి. ప్రస్తుతము చంద్రుని మహర్దశలో శని అంతర్దశ మరియు ప్రత్యాంతర దశ నడుస్తున్నది.
ఇండియా జాతకములో, చంద్రుడు 3వఇంటికి అధిపతిగా ఉంటాడు మరియు 3వఇంట శుక్రుడు, బుధుడు, సుర్యుడు మరియు శనితో కూడుకుని ఉంటాడు.
శని 9వ మరియు10వఇంటికి అధిపతి మరియు ఆశ్లేష నక్షత్రములో చంద్రునితో కూడుకుని కర్కాటకరాశిలో ఉన్నదీ.
కరోనా వైరస్ డిసెంబర్ లో వ్యాప్తిచెందటం మొదలు ఐయ్యింది. మనదేశములో ఫిబ్రవరి 2020లో మొదటికేసు నమోదు చేయబడినది.
మా ముందు నివేదికలో కూడా ఇలాంటిది 2020లో చోటుచేసుకుంటుంది అని ముందుగానే తెలుపుచున్నాము. భారతదేశము మరియు ఇతర ప్రముఖ దేశాలు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదురుకుంటాయి.
గురుడు ధనస్సు నుండి మకరంలోకి సంచరిస్తున్నపుడు, ఒక పెద్దవ్యాధి వ్యాప్తిచెందే అవకాశమన్నది.
ముఖ్యమైన విషయము ఏమిటంటే, ప్రస్తుతము గురునితో కలిసి కేతు మరియు కుజుడు ధనస్సురాశిలో సంచరిస్తున్నారు.ఇది మరింత విషమ పరిష్టితి.
కరోనా వైరస్ & జ్యోతిష్య శాస్త్ర పరిహారములు:
ఏదైన వైరస్ మీయొక్క ఇమ్మ్యూనిటీ సిస్టం బలహీనంగా ఉన్నప్పుడే మీకు హాని కలిగిస్తుంది. కరోనావైరస్ కూడా అదే విధముగా మీఒంటిలోకి ప్రవేసించి మీయొక్క దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది.కావున మీరు సరైన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.అంతేకాకుండా మీకొరకు కొన్ని ప్రత్యేక పరిహారములను అందించండం జరిగినది.అవి:
మొదటి పరిహారంగా మీరు మీయొక్క ఇమ్మ్యూనిటి సిస్టం దృఢపరుచుకోండి.ఆయుర్వేదం ప్రకారము, నిమ్మరసం, పచ్చిమిర్చి, కమలాలు, వెల్లుల్లి మరియు పెరుగు మీయొక్క శరీరానికి మరింత శక్తిని అందిస్తాయి.
దీనితోపాటుగా మీరు విటమిన్-సి తీసుకొనుటవలన మీరు అనేక వ్యాధులకు దూరముగా ఉండవచ్చును. కావున విటమిన్ - సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరిక వంటివాటిని ఆహారముగా తీసుకోవాలి.
విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతోముఖ్యమైంది మరియు వ్యాధులనుండి మమ్ములను కాపాడటానికి ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.విటమిన్ డి మీకు సూర్యరస్మి ఆధారముగా అందుతుంది.
.మీరు ఆవాలు, జాపత్రి, మిరియాలు, లవంగములుఅన్నికలిపిన మిశ్రమాన్ని మీయొక్క జేబులోకానీ లేదా బ్యాగులోకానీ పెట్టుకోండి.
సింధూరమును నీటిలో కలిపి నుదుటపై తిలకమును ధరించండి. లెడ్ సింధూరములో ఎక్కువగా ఉండుట, ఇది అనేక వ్యాధులను దూరముగా ఉంచుతుంది మరియు శరీరమును దృధాత్వాన్ని మరియు పటుత్వాన్ని ఉంచుతుంది.
ఆవుపిడకలను ఎండబెట్టి వాటిపై కర్పూరమును వెలిగించి ఇంటిమొత్తము ధూపము వేయండి.ఇలాచేయుటవలన ఇంటిలోఉండే సూక్ష్మజీవులు అన్ని చనిపోయి మీయొక్క పరిసరాలు శుభ్రముగా ఉంటాయి.
గోమాత మూత్రమును రోజు 3 నుండి4 చుక్కలను గొంతులో వేసుకొండి.
ఇవేకాకుండా, మీరు గ్రహాలను బలపరిచేందుకు మీరు అవసరమైన పరిహారములను చేపట్టాలి.
రోజు వ్యాయామము మరియు యోగచేసి శరీరాన్ని ఆరోగ్యముగా మరియు దృఢముగా ఉంచుకోండి.
12 రాశులపై కరోనా ప్రభావము:
జ్యోతిష్య శాస్త్ర ఆధారముగా 12రాశులపై ఈయొక్క మహమ్మారి ప్రభావము ఎలా ఉంటుందనేది మేము గ్రహాల స్థితిగతులను ఉద్దేశించి చెప్పటం అయినది.
రాశి. ప్రభావము
మేషరాశి | ఎక్కువగా విచారించవలసిన అవసరము లేదు. |
వృషభరాశి | ఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్త అవసరము |
మిథునరాశి | జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది. |
కర్కాటక రాశి | జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది. |
సింహరాశి | ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరములేదు. |
కన్యారాశి | ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరములేదు |
తులారాశి | ఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్త అవసరము |
వృశ్చికరాశి | జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది. |
ధనస్సురాశి | ఎక్కువగా విచారించవలసిన అవసరము లేదు. |
మకరరాశి | ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరములేదు |
కుంభరాశి | ఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్త అవసరము |
మీనరాశి | జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది. |
కరోనా వైరస్ రాకుండా తీసుకొనవల్సిన నివారణ జాగ్రత్తలు
క్రింద ఇవ్వబడిన జాగ్రత్తలు డాక్టరు మరియు ఆరోగ్యశాఖవారు జారీచేయబడిన నివారణ జాగ్రత్తలు:
ప్రతి ఒక్కరు కనీసము అయిదుసార్లు చేతులను శుభ్రముగా కడుక్కోవాలి.
ఆల్కహాల్ ద్వారా చేయబడిన శానిటైజర్ లేదా మంచి సబ్బుతో చేతులను శుభ్రముగా కడుక్కోండి.
చేతులను శుభ్రపరచుకునేతప్పుడు గోర్లనుకూడా శుభ్ర పరుచుకోండి.
ప్రతిఒక్కరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీరు చేతులను లేదా టిష్యూను అడ్డుపెట్టుకుని తరువాత దానిని చెత్తబుట్టలో వేయాలి. తరువాత చేతులను శుభ్రముగా కడుక్కోవాలి.
గుడ్డు మరియు మాంసాహారమును తినకుండా ఉండుట మంచిది.
వ్యాధి సోకినవారికి దూరముగా ఉండండి.
ఈ వ్యాధి చేతులనుండి తొందరగా వ్యాప్తి చెందుతుంది, కరచాలనమునకు దూరముగా ఉండండి.
క్రూర మృగములకు వీలైనంత దూరముగా ఉండండి.
గొంతును ఎండిపోనీయకుండా ఎప్పటికప్పుడు వీలైనన్ని మంచినీరును తాగండి.
కరోనా వైరస్ మరియు దాని ముగింపు:
జూన్ 30వ తేదీన గురుడు తిరిగి ధనసులోకి ప్రవేశిస్తాడు మరియు నవంబర్ 20వరకు ఉంటాడు. కావున ఈ వైరస్ మే నుండి సెప్టెంబర్ వరకు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశము ఉన్నదీ.
సెప్టెంబర్ తరువాత, గురుడి తిరిగి మకరములోకి నవంబర్ లో ప్రవేశించుట, వ్యాధిని అరికట్టే అవకాశము కలుగుతుంది.
మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, భారతదేశములో ఇది తక్కువగా వ్యాప్తి చెందే అవకాశమున్నది. దీనికిముఖ్య కారణము వేసవికాలము ప్రారంభము అవ్వటం. ఇతర దేశాలలో చలికాలము ప్రారంభమవుటవలన దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో, విదేశీ ప్రయాణములు వాయిదావేసుకొనుట చెప్పదగిన సూచన.