top of page

అమాంతంగా కొండెక్కిన చికెన్ ధరలు.. కారణాలివే..! 🐔💰

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ.. సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. గత వారంలో.. హైదరాబాద్ లాంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కిలో చికెన్ (స్కిన్ లెస్) ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. ఇక.. విత్ స్కిన్ అయితే.. కేవం రూ.180 నుంచి రూ.200 మాత్రమే. కాగా.. ఇప్పుడు కిలో చికెన్ ధర పెడితే గ్రామాల్లో అర కిలో మటన్ వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో చికెన్ (స్కిన్ లెస్) రూ.300 వరకు పలుకుతుంది. స్కిన్‌తో అయితే.. రూ.280 ఉంది. పెరిగిన చికెన్ ధరలు చూసి చికెన్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. వారంలోనే ధరలు ఇంతలా పెరగటం చూసి.. ఆశ్చర్యపోతున్నారు. ఏపీలోని ప్రధాన పట్టణాల్లోనూ చికెన్ ధరలు ఇలాగే మండిపోతున్నాయి. ఓవైపు చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు.. నిన్నమొన్నటి వరకు పెరుగుతూ పోయిన గుడ్ల ధరలు మెల్లిగా తగ్గుముఖం పట్టాయి.

bottom of page