🇮🇳 ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) లోగో సిద్ధమైంది. 💫 తదుపరి సమావేశంలోనే విడుదల చేసేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. 📣
కూటమి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. తదుపరి ముంబై మహానగరంలో జరగబోయే సమావేశంలో ‘లోగో’ ఆవిష్కరించేందుకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 💥 ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో విపక్ష కూటమి సమావేశం కానుంది. 📅 ఇప్పటికి రెండు సమావేశాలు ముగిసాయి. ✌️ మొదటి సమావేశం జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత, బిహార్ ఉప-ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సంయుక్తంగా బిహార్ రాజధాని నగరం పాట్నాలో విపక్ష కూటమి తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ సారథ్యంలో రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. 👥 బెంగళూరు సమావేశంలో కూటమి I.N.D.I.A గా నామకరణం జరిగింది. 🌟 ముంబైలో జరగనున్న మూడో సమావేశానికి శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే) వర్గం అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఆతిథ్యమిస్తున్నారు. 🤝