కాంగ్రెస్‌లో అసంతృప్తి చల్లారడం లేదు.. అధికారంలో లేకపోయినా.. అసంతృప్తిలో టాప్ పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లో అదే జరిగిది. డోర్నకల్ ఇంచార్జ్ రామ్ చంద్రనాయక్ ను, మహబూబాబాద్ ఇంచార్జ్ బలరాంనాయక్ ను సొంత పార్టీ కార్యకర్తలే నిలదీశారు. వారి వర్గీయులు ఎదురుతిరగడంతో ఘర్షణ జరిగింది. అటు వనపర్తి కాంగ్రెస్‌లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధిష్టానం పార్టీలో జోష్ నింపేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. 💪
మహబూబాబాబ్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి పరమేష్ నాయక్ నేతృత్వంలో.. పట్టణంలోని ఆర్తి గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో బలరాంనాయక్ మాట్లాడుతున్న సమయంలో కొంత మంది కార్యకర్తలు ఆయన్ను నిలదీశారు. ఎన్నికల సమయంలో తప్ప కార్యకర్తలకు అందుబాటులో వుండడంలేదని, మీకు ఎందుకు సహకరించాలని నిలదీశారు. ఈ క్రమంలో బలరాం నాయక్ వర్గీయులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు అక్కడే తన్నుకున్నారు. 😊