పోలీసుల తనిఖీల సమయంలో ఎమ్మెల్యే ఖైరా ఫేస్‌బుక్‌లో లైవ్‌లో ఉన్నారు. ఈ వీడియోలో తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఖైరా పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. 🗣️🚔
అరెస్ట్‌కు సంబంధించి వారెంట్ చూపించాలని కూడా అడగటం వీడియోలో కనిపిస్తుంది. ⚖️👮♂️ అనంతరం పాత డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు ఖైరాకు పోలీసు అధికారి డీఎస్పీ అచ్రు రామ్ శర్మ చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. 📺🚨 వీడియోలో ఎమ్మెల్యే ఖైరా ‘పంజాబ్ సర్కార్ ముర్దాబాద్ ‘అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసు సిబ్బంది అతన్ని నిర్బంధించి స్టేషన్‌కు తరలించారు. 🚔👥 ఎమ్మెల్యే అరెస్ట్‌ను అతని కుటుంబ సభ్యులు అడ్డుకోగా బలవంతంగా పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. 🚗🏠 ఈ అరెస్ట్ ఆప్, కాంగ్రెస్‌ల సంబంధాలను దెబ్బతీస్తుందని పలువురు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. 🌿📰 పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు, సీట్ల పంపకాలను కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 🏛️