top of page

👪 కుటుంబ పాలన, అవినీతిపై కాంగ్రెస్‌ నేతలకు మాట్లాడే హక్కేలేదు.. రాహుల్ పై బీఆర్ఎస్ నేతల ఫైర్. 🔥

📅 తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అధికార పార్టీ బీఆర్ఎస్‌పై రాహుల్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. 🔊

రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. 🛡️ కుటుంబ పాలన, అవినీతిపై కాంగ్రెస్‌ నేతలకు మాట్లాడే హక్కులేదంటూ విమర్శిస్తున్నారు. 💬 తెలంగాణ కుటుంబ పాలన కొనసాగుతుందని.. బీఆర్ఎస్.. బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనంటూ రాహుల్‌ మాట్లాడటం సిగ్గుచేటంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 👥 నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఎవరు..? రాహుల్‌, ప్రియాంక సమాధానం చెప్పాలి.. అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. 📜 కాంగ్రెస్ ను ఎవరూ నమ్మరంటూ కౌంటర్ ఇచ్చారు.

📜 అసత్యాలు మాట్లాడారు.. నిరంజన్ 📢 బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి తిప్పికొట్టారు. 🔴 కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 🚫 వారసత్వ రాజకీయాలపై రాహుల్‌ మాట్లాడడం పెద్ద జోక్‌ అని అన్నారు. 🃏 రాహుల్‌గాంధీది ఐదు తరాల వారసత్వం అంటూ నిరంజన్‌రెడ్డి కౌంటరిచ్చారు.

🔍 రాహుల్‌పై మంత్రి జగదీష్‌ విమర్శలు.. 🚌 కాంగ్రెస్ బస్సు యాత్ర రాహుల్‌కు టైంపాస్ యాత్ర అంటూ జగదీష్‌ రెడ్డి విమర్శించారు. 🚌 అవినీతికి పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 🔓 రాహుల్‌కు ఉన్న ఏకైక అర్హత వారసత్వమేని.. 🏰 కుంభకోణాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదంటూ జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. 💼 రేవంత్‌ రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివి రాహుల్‌ అభాసుపాలయ్యారని.. 🚆 కాంగ్రెస్ ఎన్ని యాత్రలు చేసినా.. 🛤️ బీఆర్‌ఎస్ జైత్రయాత్రను అడ్డుకోలేరంటూ టీవీ9తో మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. 📺🎙️

Yorumlar


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page